ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (13:02 IST)

సింహానికి ముద్దు పెట్టిన భారత క్రికెటర్ ఎవరు?

సాధారణంగా క్రూరజంతువుల దరిదాపులకు వెళ్లడం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. మీర ముఖ్యంగా పులి, సింహాల వద్దకు వెళ్లేందుకు ఏ ఒక్కరూ సాహయం చేయరు. కానీ, నిత్యం వివాదాలతో కాలం వెళ్లదీసే రవీంద్ర జడేజా తాజాగా మ

సాధారణంగా క్రూరజంతువుల దరిదాపులకు వెళ్లడం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. మరీ ముఖ్యంగా పులి, సింహాల వద్దకు వెళ్లేందుకు ఏ ఒక్కరూ సాహసం చేయరు. కానీ, నిత్యం వివాదాలతో కాలం వెళ్లదీసే రవీంద్ర జడేజా తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. 
 
ఓ జంతు ప్రదర్శనశాలలో బోనులో ఉన్న సింహాన్ని ఫెన్సింగ్‌ బయట నుంచి ముద్దు పెట్టుకోవడానికి జడేజా ప్రయత్నించాడు. ఆ ఫొటోలను జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేయడం చర్చనీయాంశమైంది. 
 
ఇప్పటికైతే సామాజిక మాధ్యమాల్లో జడేజాపై ఎలాంటి వ్యతిరేకతా వ్యక్తంకాలేదు. గతేడాది గుజరాత్‌లోని గిర్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో జడేజా తన భార్యతో కలిసి సింహాలతో దగ్గర నుంచి ఫొటోలు దిగడం పెను వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.