1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2016 (16:08 IST)

చెన్నై టెస్టు : ఇంగ్లండ్‌ను ఆదుకున్న డావ్‌సన్ - రషీద్ .. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 477 ఆలౌట్

చెన్నైలోని చెప్పాక్కం స్టేడియం వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆ జట్టును టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్లు ఆదుకున్నారు. త

చెన్నైలోని చెప్పాక్కం స్టేడియం వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆ జట్టును టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్లు ఆదుకున్నారు. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత మొదటి రోజు ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ ఆటగాళ్ళు నింపాదిగా ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు వచ్చేలా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో కుక్ 10, జెన్నింగ్స్ 1, రూట్ 88, మొయిన్ అలీ 146, బెయిర్ స్టో 49, స్టోక్స్ 6, బ‌ట్ల‌ర్ 5, డావ్‌స‌న్ 66 (నాటౌట్‌), ర‌షీద్ 60, బ్రాడ్ 19, బాల్ 12 చొప్పున పరుగులు చేశారు. 
 
కాగా, భార‌త బౌల‌ర్ల‌లో ఉమేష్‌, ఇషాంత్‌లు రెండేసి వికెట్లు తీయ‌గా, జ‌డేజా మూడు వికెట్లు తీశాడు. అశ్విన్‌, మిశ్రాల‌కు చెరో వికెట్ ద‌క్కింది. ఇంగ్లండ్‌కు ఎక్స్‌ట్రాల రూపంలో 15 ప‌రుగులు ద‌క్కాయి. ఆ తర్వాత భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.