గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (14:37 IST)

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. వంద కోట్ల పరువు నష్టం.. ధోనీ కేసు

Dhoni
ఐపీఎస్ అధికారి జి. సంపత్ కుమార్‌కు వ్యతిరేకంగా నేరపూరిత కోర్టు ధిక్కరణ అభియోగాల క్రింద మద్రాస్ హైకోర్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. తనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసినందుకు రూ.100 కోట్ల పరువు నష్టం కోరుతూ సంపత్ కుమార్, జీ మీడియా కార్పొరేషన్‌పై ధోనీ లోగడ సివిల్ వ్యాజ్యం దాఖలు చేశారు. 
 
తదనంతరం మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు తోపాటు తనపై సంపత్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ధోనీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నేరపూరిత కోర్టు ధిక్కరణ కింద అతడ్ని శిక్షించాలని కోరారు. మద్రాస్ హైకోర్టు పట్ల అగౌరవంగా, అపకీర్తి కలిగించే విధంగా వ్యవహరించినట్టు ధోనీ తెలిపారు.