ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (20:00 IST)

కోహ్లీ వంకచక్కంగా తీస్తా.. జట్టు కోచ్ పదవి ఇవ్వండి: దరఖాస్తు చేసుకున్న ఇంజనీర్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఓ ఇంజనీర్ పగబట్టాడు. ఫలితంగా అతని పనిబట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఎంపిక చేయాలని కోరుతున్నాడు. ఈ మేరకు ఆయన కోచ్ పదవికి దరఖా

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఓ ఇంజనీర్ పగబట్టాడు. ఫలితంగా అతని పనిబట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఎంపిక చేయాలని కోరుతున్నాడు. ఈ మేరకు ఆయన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఇంజనీర్ పేరు ఉపేంద్రనాత్ బ్రహ్మచారి. వెస్ట్ బెంగాల్ వాసి. ప్రస్తుతం ఈయన మహారాష్ట్రలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
 
టీమిండియాకి పెద్ద పేరున్న వ్య‌క్తి కోచ్‌గా రావాల‌ని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భావిస్తున్నాడ‌ని, త‌న పేరు చాలా పెద్దదని ఆ ఇంజ‌నీర్ బీసీసీఐకి విన్న‌వించుకున్నాడు. కాబట్టి తాను ఆ పదవికి అర్హుడినేన‌ని, ఒకవేళ బీసీసీఐ మాజీ క్రికెటర్‌ని కోచ్‌గా ఎంపికచేస్తే అది అనిల్‌ కుంబ్లేని అవమానించినట్లేన‌ని అన్నాడు. త‌న‌ను ఆ ప‌ద‌వికి తీసుకుంటే మాత్రం ఎలాంటి బాధలూ ఉండవని ఆయ‌న పేర్కొన్నాడు. త‌నలాంటి వారే కోహ్లీ లాంటివారిని సరైన దారిలో పెట్టగల‌ర‌ని ఆయ‌న అన్నాడు.