మంగళవారం, 2 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

ట్వంటీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌ పర్యటనకు భారత క్రికెట్ జట్టు

indis vs ireland
భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. వెస్టిండీస్ పర్యటనను ముగించుకుని అటు నుంచే ఐర్లాండ్‌కు వెళుతుంది. అక్కడ వారం రోజుల పాటు పర్యటిస్తుంది. ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌లతో కూడిన టీ20 సిరీస్‌ను ఆడుతుంది. ఇందులోభాగంగా, ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ ఆగస్టు 18న, రెండో మ్యాచ్ 20, మూడో మ్యాచ్ 23న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లన్నీ మలాహిడే స్టేడియం వేదికగా జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్నాయి. 
 
అయితే, ఈ షెడ్యూల్‌పై బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ఐర్లాండ్ క్రికెట్ బోర్డు మాత్రం షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. కాగా, వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు తన చివరి మ్యాచ్‌ను ఆగస్టు 13వ తేదీన ఆడుతుంది. ఆ తర్వాత ఐర్లాండ్‌కు బయలుదేరి వెళుతుంది. ఈ సిరీస్‌కు సీనియర్లందరికీ విశ్రాంతినిచ్చి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో యువ జట్టును పంపించే అవకాశాలు ఉన్నాయి. కాగా, గత 2022లో కూడా ఐర్లాండ్‌లో పర్యటించిన భారత క్రికెట్ జట్టు రెండు టీ20 మ్యాచ్‌లు ఆడిన విషయం తెల్సిందే. 

ప్రభుత్వం అనుమతిస్తేనే.. 

వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. అక్టోబరు 5 నుంచి నవంబరు 19వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత్ ఆతిథ్యమిచ్చే ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 48 వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 46 రోజులు పాటు ఈ టోర్నీ సాగుతుంది. 
 
అయితే, ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని అమితాసక్తితో ఎదురు చూసే చిరకాల ప్రత్యర్థులైన భారత్ - పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబరు 15వ తేదీన అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది. అయితే, ఈమెగా ఈవెంట్ టోర్నీలన్నీ భారత్‌లో జరుగుతున్నందున శత్రుదేశమైన పాకిస్థాన్ క్రికెట్ జట్టు వస్తుందా రాదా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ, దౌత్య కారణాల నేపథ్యంలో చాలా కాలంగా పాకిస్థాన్‌లో భారత్ పర్యటించడం లేదు. దాంతో భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు తాము రాబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వర్గాలు పదేపదే చెబుతున్నయియ. ఇపుడు వరల్డ్ ఈవెంట్ భారత్‌లో జరుగుతున్నందున పాకిస్థాన్ వస్తుందా రాదా అన్నది చర్చనీయాంశంగా మారింది.
 
అయితే భారత్‌లో తమ క్రికెట్ జట్టు అడుగుపెట్టేది లేనిదీ దేశ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడివుంటుందని పీసీబీ స్పష్టం చేసింది. ప్రభుత్వం అనుమతి ఇస్తే భారత్‌లో వరల్డ్ కప్ ఈవెంట్‌లో పాలుపంచుకుంటామని లేనిపక్షంలో దూరంగా ఉంటామని తెలిపింది. అయితే, ఐసీసీ మాత్రం భారత్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్థాన్ జట్టు తప్పకుండా వస్తుందన్న ధీమాను వ్యక్తం చేసింది.