1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (09:32 IST)

సరికొత్త హెయిర్‌స్టైల్‌తో విరాట్ కోహ్లీ.. కొత్త లుక్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్

విరాట్ కోహ్లీ. క్రికెట్ మైదానంలో దూకుడైన ఆటకే కాదు.. స్టైలిష్ ఐకాన్ కూడా. అనునిత్యం కొత్త కొత్త స్టైల్స్ ఫాలో అవుతుంటాడు. హెయిర్ కట్, గడ్డం, మీసం, డ్రెస్.. ఇలా ఏదైనా డిఫరెంట్‌గా ఉండాల్సిందే. న్యూ లుక్

విరాట్ కోహ్లీ. క్రికెట్ మైదానంలో దూకుడైన ఆటకే కాదు.. స్టైలిష్ ఐకాన్ కూడా. అనునిత్యం కొత్త కొత్త స్టైల్స్ ఫాలో అవుతుంటాడు. హెయిర్ కట్, గడ్డం, మీసం, డ్రెస్.. ఇలా ఏదైనా డిఫరెంట్‌గా ఉండాల్సిందే. న్యూ లుక్‌తో యూత్‌కు ఐకాన్‌గా నిల‌వ‌డం కోహ్లీకి చాలా ఇంట్రెస్ట్. ఈ క్రమంలో ఇప్పటివరకు విరాట్ ఎన్నో లుక్స్‌లో సందడి చేశాడు. తాజాగా సరికొత్త హెయిర్ క‌ట్‌తో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాడు. 
 
ఫుట్‌బాలర్ల తరహాలో పక్కల్లో జుత్తు మొత్తం తీయించేసి.. గడ్డం పెంచుకుని కొత్తగా కనిపించాడతను. కొత్త హెయిర్‌ స్టైల్‌తో ఫ్యాన్స్‌ను హుషారెత్తిస్తున్నాడు. కొత్త హెయిర్ స్టైల్‌లో సెల్ఫీ తీసుకుని ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. అది చూసిన అభిమానులు కోహ్లీ హెయిర్ స్టైల్ సూప‌ర్ అంటూ కితాబిస్తున్నారు. తాజా విరాట్ హెయిర్ స్టైల్కు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అపెనీ జార్జ్ కొత్త లుకింగ్ ఇచ్చారు.