మంగళవారం, 18 జూన్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (10:12 IST)

వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ ప్రపంచ రికార్డ్.. ఒకే ఇన్నింగ్స్‌‌లో 444 పరుగులు.. హేల్స్ అదుర్స్

పరిమిత ఓవర్ల వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ కొత్త రికార్డు సృష్టించింది. ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ పరుగులు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్

పరిమిత ఓవర్ల వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ కొత్త రికార్డు సృష్టించింది. ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ పరుగులు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసింది. ఫలితంగా 2006లో నెదర్లాండ్స్‌పై శ్రీలంక సాధించిన 443 పరుగుల రికార్డు బద్ధలైంది. 
 
అలెక్స్ హేల్స్ 122 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లతో 171 రన్స్ చేసి విధ్వంసం సృష్టించగా… బట్లర్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 నాటౌట్, జో రూట్ 86 బంతుల్లో 85రన్స్ చేయడంతో.. ఇంగ్లండ్ 444 పరుగుల భారీ స్కోరును నమోదు చేసుకుంది. కెప్టెన్ మోర్గాన్ 27 బాల్స్ లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 57 రన్స్ చేశాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా హేల్స్ నిలిచాడు.
 
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ధాటికి 10 ఓవర్లలో 110 పరుగులిచ్చిన వహాబ్ రియాజ్ వన్డేల్లో రెండో అతి చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. కాగా దుస్సాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 42.4 ఓవర్లలో 275 పరుగులు చేసి.. 169 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.