మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (14:39 IST)

ఇంకెలాంటి కామెంట్లు పెడతారోనని ఫోటో సీక్రెట్ చెప్పేసిన హార్దిక్ పాండ్యా

భారత క్రికెట్ జట్టులో చోటుదక్కించుకుని అతి తక్కువ కాలంలోనే యువ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన క్రికెటర్ హార్దిక్ పాండ్యా. పాండ్యా గురించిన ఓ వార్త గతవారం రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. దీ

భారత క్రికెట్ జట్టులో చోటుదక్కించుకుని అతి తక్కువ కాలంలోనే యువ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన క్రికెటర్ హార్దిక్ పాండ్యా. పాండ్యా గురించిన ఓ వార్త గతవారం రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. దీనికి కారణం కూడా హార్దిక్ పాండ్యానే.
 
ఇటీవల ఓ యువతితో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను పాండ్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే, ఈ పిక్ వైరల్ అయిపోయింది. దీనిపై నెటిజన్లు తమకుతోచిన విధంగా స్పందించారు. 
 
హల్లో పాండ్యా... ప్రేమలో పడ్డావా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరా అమ్మాయి? అంటూ ఆరాలు తీయడం ప్రారంభించారు. మరికొందరు మరికొంచెం ముందుకు వెళ్లి ‘పాండ్య త్వరగా ఆ గుడ్‌ న్యూస్‌ ఏంటో చెప్పెయ్‌’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. 
 
దీంతో భయపడిపోయిన పాండ్యా... ఇంకెలాంటి కామెంట్లు పెడతారోనని ఆందోళన చెంది... ఆ ఫోటో సీక్రెట్‌ను బహిర్గతం చేశాడు. ‘మిస్టరీ వీడింది. ఆమె నా సోదరి’ అంటూ అభిమానుల ఉత్సాహాన్ని నీరుగార్చేశాడు. 
 
కాగా, ఈ మధ్య బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పోస్ట్ చేసిన సైకిల్ ఫోటోకు కామెంట్ పెట్టిన పాండ్య వూహాగానాలకు ఊతమిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పరిణీతి ముందుకొచ్చి, తనకు పాండ్య తెలియడని వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.