బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2017 (16:55 IST)

విరాట్ కోహ్లీకి ఫిట్నెస్ సమస్యలు.. నాలుగో టెస్టుకు దూరం

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఫిట్నెస్ సమస్య వేధిస్తోంది. దీంతో ఆయన నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు.. ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడింద

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఫిట్నెస్ సమస్య వేధిస్తోంది. దీంతో ఆయన నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు.. ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడింది. సిరీస్‌ విజయంలో నిర్ణయాత్మకమైన చివరి టెస్టు శనివారం ధర్మశాల వేదికగా ప్రారంభంకానుంది. అయితే, నిర్ణయాత్మకమైన ఈ టెస్టులో కోహ్లీ ఆడతాడో లేదో సందేహంగా మారింది. 
 
రాంచీలో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ కుడిభుజానికి గాయమైంది. బంతి బౌండరీ దాటకుండా అతడు ప్రమాదకర రీతిలో డైవ్‌చేశాడు. శరీర భారమంతా కుడిభుజంపై పడడంతో నొప్పితో విలవిల్లాడాడు. ఒక రోజు మొత్తం మైదానంలోకి రాలేదు. భారత ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తాడో లేదో అన్న సందేహాల మధ్య కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. దీంతో అతడి ఫిట్నెస్‌పై నమ్మకం కుదిరింది. 
 
ఈ నేపథ్యంలో ధర్మశాలలో జట్టు ప్రాక్టీస్‌లో కోహ్లీ బ్యాటింగ్‌ చేయలేదు. శ్రేయాస్‌ అయ్యర్‌ను స్టాండ్‌అప్‌ ఆటగాడిగా ఎంపిక చేశారు. ఈ పరిస్థితుల్లో ‘నేను 100 శాతం ఫిట్నెస్‌తో ఉంటేనే మ్యాచ్‌ ఆడతాను. ఫిజియో పాట్రిక్‌ ఫర్హర్ట్‌తో కలిసి ఫిట్నెస్‌ పరిస్థితిని సమీక్షించుకోవాల్సి ఉంది. రాత్రికి లేదా శనివారం ఉదయం విషయం వెల్లడిస్తాం’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.