బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (13:10 IST)

కోహ్లీకి ఏకాగ్రత లేదు.. నెగటివ్ ఆలోచనలు ఏర్పడ్డాయి: మార్క్ వా

సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ రాణించలేకపోతోంది. ఇంగ్లండ్‌ను సునాయాసంగా మట్టికరిపించిన టీమిండియా.. కంగారూల చేతిలో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నారు. ఇందుకు కారణాన్ని ఆస్ట్ర

సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ రాణించలేకపోతోంది. ఇంగ్లండ్‌ను సునాయాసంగా మట్టికరిపించిన టీమిండియా.. కంగారూల చేతిలో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నారు. ఇందుకు కారణాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా చెప్పాడు. ఇందుకు కారణం ప్రపంచ స్థాయి ఆటగాడిగా పేరొందిన భారత స్టార్ క్రికెటర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకాగ్రత కోల్పోవడమేనని చెప్పారు. 
 
బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ పేలవ ప్రదర్శనతో కేవలం 12 పరుగులకే ఔట్ అయి పెవిలియన్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి అంపైర్‌ను రివ్యూ కోరడం.. అందులో కోహ్లి ఎల్‌బీడబ్ల్యూగా ప్రకటించడంతో కోహ్లి చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగాడు. అద్భుతమైన ఆటగాడిగా కోహ్లి ఎన్నో సెంచరీలు, డబుల్ సెంచరీలు చేసి కూడా ఎల్‌డబ్లును అంచనా వేయలేకపోవడం తనను విస్మయానికి గురిచేసిందని అభిప్రాయపడ్డాడు. వరుస ఇన్నింగ్స్‌లలో విఫలం వస్తు ఉండటంతో కోహ్లిలో నెగటివ్ ఆలోచనలు ఏర్పడి ఏకాగ్రత కోల్పోవడానికి దారితీస్తుందని మార్క్ వా విమర్శించాడు.
 
అద్భుతాలు చేస్తాడనకుంటే విరాట్ పేలవ ప్రదర్శనతో అనవసర తప్పిదాలతో వికెట్ కోల్పోతూ వస్తున్నాడని మార్క్ వా ఎద్దేవా చేశాడు. జట్టుకు అండగా నిలబడాల్సిన సారథి మధ్యలోనే నిష్క్రమిస్తే.. టీమ్‌లోని మిగతా సభ్యులపై ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పాడు.