బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (14:14 IST)

'స్పిన్నర్' అశ్విన్ కాదు.. చెపాక్ 'మాస్టర్' - పిక్ వైరల్

ఇంగ్లండ్‌తో త‌న సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో స్పిన్నర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఏకంగా 8 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అశ్విన్‌, రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా సెంచ‌రీ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ మంచి ప్రదర్శన చూపించాడు. 
 
అయితే ఇప్పుడు అశ్విన్ భార్య ప్రీతి చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. త‌మిళ సూప‌ర్‌స్టార్ విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ పోస్ట‌ర్‌ను ఎవ‌రో మార్ఫింగ్ చేసి అశ్విన్ ఫొటోను అతికించారు. ఆ ఫొటోను ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ.. ఇలా ఎవ‌రు చేశారు అని ఓ స్మైలీ ఎమోజీని యాడ్ చేసింది. 
 
కాగా, ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. ఇదే స్టేడియంలో తొలి టెస్ట్‌లో ఎదురైన దారుణ ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకుంది. స్పిన్ పిచ్‌పై ఇంగ్లండ్‌ను తిప్పేసిన టీమిండియా స్పిన్న‌ర్లు.. 317 ప‌రుగుల భారీ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీయ‌గా.. రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టామ్ స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ 5 వికెట్లు తీయ‌డం విశేషం. 
 
ఆరంభం అదిరింది..
భారత యువ స్నిన్నర్ అక్షర్ పటేల్. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత అతను కోలుకోవడంతో తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అంతేకాదు.. చెన్నైలో జరిగిన రెండో టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన టెస్ట్ కెరీర్‌కు శ్రీకారం చుట్టిన అక్షర్ పటేల్.. అద్భుత ఆరంభాన్నిచ్చాడు. అరంగేట్రం చేసిన టెస్టులోనే అయిదు వికెట్లు తీసుకున్నాడు. 
 
ఇంగ్లండ్‌తో చెన్నైలో జ‌రిగిన రెండ‌వ టెస్టులో భార‌త్ 317 ప‌రుగుల తేడాతో నెగ్గింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అక్ష‌ర్ ప‌టేల్ త‌న బౌలింగ్ స‌త్తా చాటాడు. స్పిన్‌కు అనుకూలించిన చెన్నై పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్ప‌లు పెట్టాడు. 
 
21 ఓవ‌ర్లు వేసిన అక్ష‌ర్.. 60 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో అక్ష‌ర్ ప‌టేల్ మొత్తం ఏడు వికెట్లు తీసుకున్నాడు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న అక్ష‌ర్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 20 ఓవ‌ర్లు వేసి రెండు వికెట్లు తీసుకున్నాడు. అలాగే, తొలి ఇన్నింగ్స్‌లో ఆర్.అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. ఇదే స్టేడియంలో తొలి టెస్ట్‌లో ఎదురైన దారుణ ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకుంది. స్పిన్ పిచ్‌పై ఇంగ్లండ్‌ను తిప్పేసిన టీమిండియా స్పిన్న‌ర్లు.. 317 ప‌రుగుల భారీ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీయ‌గా.. రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టామ్ స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ 5 వికెట్లు తీయ‌డం విశేషం. 
 
ఇక తొలి ఇన్నింగ్స్‌లో 134 ప‌రుగుల‌కు ఆలౌటైన ఇంగ్లండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 164 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో చివ‌ర్లో మెరుపులు మెరిపించిన మోయిన్ అలీ 43 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు తీయ‌డంతో పాటు సెంచ‌రీ చేసిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.