ఐపీఎల్ 9: ధోనీ బలంతో పుణే జట్టు గెలుస్తుందా?!
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో ధోనీ జట్టు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. ట్వంటీ-20ల్లో ధోనీ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అనే విషయం తెలిసిందే. ఎన్నో మ్యాచ్‌లను తన తెలివితేటలతో గెలిపించిన ధోనీకి ప్రస్తుతం గడ్డుకాలం ఏర్పడింది. ఐపీఎల్‌లో పుణేకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ పనైపోయిందని చెప్పలేం. గురువారం జోరుమీదున్న ఢిల్లీతో పుణేతో తలపడనుంది.
అయితే గాయాలతో ఇబ్బందులు, ఫామ్ లేమి కారణంగా పుణేపై జహీర్ సేనదే పైచేయిగా కనిపిస్తోంది. ముఖ్యంగా నలుగురులు విదేశీ ప్లేయర్ డుప్లెసిస్, పీటర్సన్, స్మిత, మిచెల్ మార్ష్‌లు గాయాలతో ఐపీఎల్‌కు దూరమయ్యారు. కానీ ధోనీ ఉన్నాడనే బలంతో వరుసగా ఓటములు ఎదురైనప్పటికీ రాణించేందుకు టీమ్ రెడీ అవుతోంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌ల్లో ధోనీ సేన అద్భుతాలు సృష్టిస్తుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.