మంగళవారం, 11 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మే 2016 (18:53 IST)

ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఓడింది.. కంటతడిపెట్టిన సచిన్ బేబీ.. ట్విట్టర్లో ప్రశంసలు..!

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ నిర్దేశించిన 209 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించే క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరంభంలో మెరుగ్గా ఆడినా ఆపై తడబడింది. చివరకు ఓటమి అంచుల దాకా వెళ్ళి ప్రేక్షకుల్లో ఉత్కంఠను ఏర్పరిచింది. 
 
ఓటమి అంచుల్లో సచిన్ బేబీ రెండు బంతుల్లో 14 పరుగులు చేశాడు. అయినప్పటితీ తొలి బంతికి సింగిల్ రన్ మాత్రమే తీయగలిగిన సచిన్ తమ జట్టు ఓడిపోతున్నందుకు జీర్ణించుకోలేక కంటతడిపెట్టాడు. ఆ సమయంలో మ్యాచ్ చూసినవారిలో చాలామంది కూడా సచిన్ ఏడుపును చూసి ఏడ్చేశారు. 10 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 18 పరుగులు చేసిన సచిన్ బేబీ జట్టు ఓడిపోతున్న కారణంగా కన్నీళ్ళు పెట్టుకున్నందుకు ఫ్యాన్స్ బాధపడ్డారు. అంతేగాకుండా సచిన్ బాగా ఆడాడని ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు.