శుక్రవారం, 14 జూన్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 మే 2016 (17:31 IST)

ఐపీఎల్ - 9 : విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు సిద్దమయ్యాయి. రాత్రి 8 గంటలకు బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.
 
అయితే, ఈ ఫైనల్ పోరులో నెగ్గిన, ఓడిన జట్లకు వచ్చే డబ్బులు ఎంతనేది ఆసక్తికరమైన అంశం. తుది సమరంలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ, ఓడిన రన్నరప్ జట్టుకు రూ.11 కోట్లు అందుతుంది. అయితే ప్లే ఆఫ్ మ్యాచ్‌లలో ఓడిపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ లయిన్స్ జట్లకు చెరో రూ.7.50 కోట్లు ఇవ్వనున్నారు.