1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. IPL 2022 Points Table: RCB Move Up to Second After Win Against Lucknow

ఐపీఎల్ 15 : లక్నోపై బెంగుళూరు విజయం

bangalore
ఐపీఎల్ పోటీల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు 18 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆ తర్వాత 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బెంగుళూరు జట్టు 18 పరుగుల తేడాతో గెలుపొందింది. 
 
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బెంగుళూరు జట్టు మొదటి రెండు వికెట్లను ఏడు పరుగులకే కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత 62 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. అయితే, కెప్టెన్ డుప్లెసిస్ సమయోచితంగా ఆడారు. సహచరులు ఒక్కొక్కరూ వెనుదిరుగుతున్నప్పటికీ క్రీజ్‌లో పాతుకునిపోయాడు. 
 
ఫలితంగా 64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేయగా, మ్యాక్స్‌వెల్ 11 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిర్సర్ సాయంతో 23 పరుగులు చేశారు. షాబాజ్ అహ్మద్ 22 బంతుల్లో ఓ ఫోర్ సాయంతో 26 పరుగులు చేశారు. కెప్టెన్ డుప్లెసిస్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 181 పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన లక్నో జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ 30, కృనాల్ పాండ్య 42, స్టోయినిస్ 24 మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేక పోయారు. దీంతో 18 పరుగుల తేడాతా ఓడిపోయింది. ఈ జట్టులో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో మూడింటిలో ఓడింది. బెంగుళూరు జట్టు ఐదో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తల్లి కాబోతోన్న మరియా షరపోవా.. ఇదిగోండి బేబీ బంప్