గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (12:11 IST)

తల్లి కాబోతోన్న మరియా షరపోవా.. ఇదిగోండి బేబీ బంప్

Sharapova
Sharapova
టెన్నిస్ క్వీన్ మరియా షరపోవా తల్లి కాబోతోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. మంగళవారం తన 35వ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసి... 'విలువైన ప్రారంభం' అని క్యాప్షన్ పెట్టింది.
 
2020లో టెన్నిస్‌కు షరపోవా గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్‌గా నిలిచింది. 
 
ఈ నేపథ్యంలో బ్రిటీష్ బిజెనెస్ మెన్ అలెగ్జాండర్ గిల్క్స్‌తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు గత డిసెంబర్‌లో షరపోవా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అంటూ పోస్టు పెట్టింది. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.