శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 31 డిశెంబరు 2016 (21:11 IST)

ఏయ్ కైఫ్... సూర్య నమస్కారం ఇస్లాంకు వ్యతిరేకం అని తెలియదా...?

ఇటీవలే మహ్మద్ షమీ తన భార్యాపిల్లలతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేస్తూ ఆనందకరమైన క్షణాలు అంటూ కామెంట్ పెట్టాడు. ఐతే ఆ ఫోటోలో కైఫ్ భార్య స్లీవ్ లెస్ టాప్ ధరించడంపై కొందరు నెటిజన్లు మండిపడ్డారు. ఐతే మహ్మద్ కైఫ్ మాత్రం వారి అభిప్రాయాలను తోసిపుచ్చారు. ఇస్ల

ఇటీవలే మహ్మద్ షమీ తన భార్యాపిల్లలతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేస్తూ ఆనందకరమైన క్షణాలు అంటూ కామెంట్ పెట్టాడు. ఐతే ఆ ఫోటోలో కైఫ్ భార్య స్లీవ్ లెస్ టాప్ ధరించడంపై కొందరు నెటిజన్లు మండిపడ్డారు. ఐతే మహ్మద్ కైఫ్ మాత్రం వారి అభిప్రాయాలను తోసిపుచ్చారు. ఇస్లాం ఏం చెపుతుందో తమకు తెలుసునంటూ ట్వీట్ చేశారు. అలాంటి కైఫ్ ఇవాళ తను సూర్య నమస్కారం చేస్తున్న ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీంతో మళ్లీ రగడ మొదలైంది. 
 
ఇస్లాం మతానికి సూర్య నమస్కారం వ్యతిరేకం అని తెలియదా అంటూ ధ్వజమెత్తారు. దీనిపై కైఫ్ సమాధానమిస్తూ... 'సూర్య నమస్కారం అన్నది పూర్తిగా భౌతిక వ్యవస్థ పనితీరుకు సంబంధించినదే కాకుండా వ్యాయామానికి సంబంధించిన ప్రక్రియ. అల్లా నా హృదయంలో ఉన్నాడు. ఇకపోతే జిమ్ కెళ్లి వ్యాయామం చేసినా, సూర్య నమస్కారం చేసినా ఒక్కటే కదా. ఇందులో తేడా ఏముంది అని ఘాటుగా ట్వీట్ చేశారు. మరోవైపు కైఫ్ వ్యాఖ్యలకు మరికొందరు మద్దతు ప్రకటిస్తున్నారు.