శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (08:50 IST)

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 వేడుకలో కియారా డ్యాన్స్

Kiara Advani
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. ఆమె ఇటీవలే ఆమె నటించిన షేర్షా, జుగ్‌జగ్ జీయో చిత్రాలకు వరుసగా 'ఉత్తమ నటి'  'పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను అందుకుంది.
 
ఇటీవలే తన ప్రియుడు-షేర్షా సహనటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహిళా ప్రీమియర్ లీగ్ 2023లో డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ కోసం ఆమె సిద్ధం అవుతోంది. 
 
ముంబైలో జరిగే క్రీడా కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనుంది. బీసీసీఐ నిర్వహించే మహిళల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలో కియారా  డ్యాన్స్ కోసం ఆమె అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 
 
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 4, 2023 నుండి ముంబైలో ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరగనుంది.