గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (17:47 IST)

సిగ్గులేదా.. ప్రజలను మోసం చేసేందుకు నా పేరు వాడుకుంటారా?: సెహ్వాగ్

ట్విట్టర్లో ఛలోక్తులు, చమత్కారాలను కలిపి ట్వీట్ చేయడంలో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దిట్ట. ఇతడు సామాజిక వెబ్ సైట్లలో ఎంతమేరకు హాస్యం పండిస్తాడో.. అంతకంతట కోపిష్టి కూడాను. తాజాగా ఓ ఘటనపై వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
 
రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రీయ లోక్ తంత్రిక్ పార్టీ ప్రకటనలకు సెహ్వాగ్‌ పేరును ఆయన అనుమతి లేకుండా వాడుకుంది. దుబాయ్‌లో జరుగుతున్న టీ-20ల్లో పాల్గొనే ఓ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు వ్యవహరిస్తున్న సెహ్వాగ్.. ఈ విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకుని మండిపడ్డాడు. తన అనుమతి లేకుండా రాజకీయ పార్టీలు తన పేరును వాడుకోవడాన్ని వీరూ ఖండించాడు. 
 
తాను ప్రస్తుతం దుబాయ్‌లో వున్నానని, ఏ పార్టీతో తనకు సంబంధాలు లేవన్నాడు. ఏమాత్రం సిగ్గు లేకుండా ఎన్నికల ప్రచారం కోసం తన పేరు వాడుకున్నారు. ఇలా ప్రజలను మోసం చేసేందుకు తన పేరు వాడుకుంటున్నందుకు బాధగా వుంది. అధికారం కోసం ప్రజలను మోసం చేసేందుకు రాజకీయ పార్టీలు ఇలాంటి పనులు చేస్తున్నాయని.. వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్ అయ్యాడు.