ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (08:05 IST)

ఐపీఎల్ 2024 : మ్యాక్స్‌వెల్ పేరిట చెత్త రికార్డు.. బుమ్రాకు అరుదైన రికార్డు!!

Jasprit Bumrah
స్వదేశంలో ఐపీఎల్ 2024 సీజన్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, పలు అరుదైన రికార్డులతో పాటు చెత్త రికార్డులు కూడా ఆటగాళ్ల పేరిట నమోదవుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్‌వెల్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. అలాగే, భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట అరుదైన రికార్డు నమోదైంది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఈ రెండు రికార్డులు నమోదు కావడం గమనార్హం. రాయల్ ఛాలెంజర్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్ బుమ్రా ఏకంగా ఐదు వికెట్లు నేలకూల్చాడు. అలాగే, మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ టోర్నీ మ్యాచ్‌లలో అత్యధికసార్లు డకౌట్లు అయ్యాడు. ఫలితంగా దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మల సరసన నిలిచాడు.
 
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య గురువారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఇందులో బుమ్రా వేసిన నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్‌లో ఆర్సీబీపై 5 వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. గతంలో ఆశిష్ నెహ్రా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున 4 వికెట్లు తీయగా, ఇప్పటివరకు బెంగుళూరుపై అదే అత్యుత్తమ బౌలింగ్‌గా ఉండేది. 
 
ఇపుడు ఐపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఫాల్కనర్, ఉనాద్కత్, భువనేశ్వర్ సరసన బుమ్రా కూడా చేశారు. అలాగే, ఆర్సీబీపై అత్యధికంగా 29 వికెట్లు తీసిన ఆటగాడుగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా3 వికెట్లు హౌల్ సాధించిన బౌలర్‌గా అవతరించాడు. ఈ హౌల్‌ను బుమ్రా ఏకంగా 21 సార్లు నమోదు చేయడం గమనార్హం. 
 
ఇకపోతే, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్లు అయిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. ఇప్పటివరకు 187సార్లు డకౌట్లు అయిన ఆటగాళ్ల జాబితాలో దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మలు ఉన్నారు.