1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2016 (17:55 IST)

చెన్నై టెస్ట్ : అలీ సెంచరీతో తేరుకున్న ఇంగ్లండ్.. తొలి రోజు స్కోరు 284/4

చెన్నై వేదికగా శుక్రవారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 284 ప

చెన్నై వేదికగా శుక్రవారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ఒక దశలో 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్ జట్టును ఎంఎం ఆలీ ఆదుకున్నాడు. ఈ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 120 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. 
 
అంతకుముందు ఇంగ్లండ్ ఓపెనర్లలో కుక్ (10), జెన్నింగ్స్ (1) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రూట్ (88), అలీ (120 నాటౌట్)లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో రూట్, బెయిర్‌స్టోలు (49)లు ఔటయ్యారు. 
 
అయితే, స్ట్రోక్స్‌ (5)తో కలిసి చివరి రోజు ఆట ముగిసే సమయానికి మరో వికెట్ పడకుండా అలీ జాగ్రత్త పడ్డారు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కాగా, భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు.