నా భార్యను సోదరుడుతో అత్యాచారం చేయిస్తానా? : క్రికెటర్ షమీ
తన సోదరుడితో తన భార్యపై అత్యాచారం చేయించానని వచ్చిన ఆరోపణలపై క్రికెటర్ మహ్మద్ షమీ స్పందించారు. ఈ ఆరోపణలన్నీ సత్యదూరమన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల అనేక జీవితాలో నాశనమైపోతాయని వాపోయాడు.
తన సోదరుడితో తన భార్యపై అత్యాచారం చేయించానని వచ్చిన ఆరోపణలపై క్రికెటర్ మహ్మద్ షమీ స్పందించారు. ఈ ఆరోపణలన్నీ సత్యదూరమన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల అనేక జీవితాలో నాశనమైపోతాయని వాపోయాడు. అందువల్ల ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ జరపాలని ఆయన ప్రాధేయపడ్డాడు.
కాగా, తనపై తన భర్త సోదరుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటూ క్రికెటర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన సోదరుడిని గదిలోకి పంపి... బయట షమీ తాళం వేశాడని, తాను గొడవ చేస్తే మళ్లీ తలుపు తీశాడని ఆమె ఆరోపించారు.
ఈ ఆరోపణలపై షమీ స్పందిస్తూ, అత్యాచారయత్నం జరిగిందంటూ హసీన్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. హసీన్ చెబుతున్నట్టు డిసెంబర్ 7వ తేదీన తన సోదరుడు ఇక్కడ లేడని... ముర్దాబాద్‌లో ఉన్నాడన్నాడు. తాను కూడా డిసెంబర్ 2 నుంచి 6 వరకు టెస్ట్ మ్యాచ్ ఆడానని... ఆ తర్వాత భువనేశ్వర్ రిసెప్షన్‌కు తన భార్యతో కలసి హాజరయ్యానని తెలిపాడు.
డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు తమ స్వస్థలానికి వెళ్లామని చెప్పాడు. ఇలాంటప్పుడు ఆమెపై తన సోదరుడు అత్యాచారయత్నం చేయడం ఎలా సంభవమని ప్రశ్నించాడు. హసీన్ కేసుతో చాలా జీవితాలు ముడిపడి ఉన్నాయని... పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని, విచారణను పూర్తి చేయాలని కోరాడు.