బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (21:35 IST)

ధోనీ తక్కువోడు కాదు.. మైదానంలో ఏం పని చేశాడో చూడండి

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ తక్కువోడేం కాదు. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు కీపింగ్‌లో రాణిస్తున్నాడు. అదేసమయంలో మైదానంలో కొన్ని చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ వార్తలకె

car - dhoni
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ తక్కువోడేం కాదు. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు కీపింగ్‌లో రాణిస్తున్నాడు. అదేసమయంలో మైదానంలో కొన్ని చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ వార్తలకెక్కుతున్నాడు. 
 
ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా ఆ దేశ ఫ్యాన్స్ అల్లరి చేసింది. దీంతో మ్యాచ్‌కు కొంత ఆటంకం ఏర్పడింది. ఆసమయంలో భారత క్రికెటర్లంతా డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నారు. కానీ, ధోనీ మాత్రం క్రికెట్ మైదానంలో హాయిగా ఓ కునుకు తీశాడు. ఈ వీడియో వైరల్ అయింది. 
 
ఇపుడు శ్రీలంకతో జరిగిన ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 5-0తో కైవసం చేసుకుంది. దీంతో ఆ తర్వాత వన్డే సిరీస్ ట్రోఫీతో భారత క్రికెట్ జట్టు సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. ఇంతలో మైదానంలో ఉన్న ఓ వ్యానులో ట్రోఫీతో క్రికెటర్లందరినీ ఎక్కించుకుని స్వయంగా డ్రైవ్ చేస్తూ మైదానం మొత్తం తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోనూ మీరూ చూడండి.