లలిత్ మోడీ, మాల్యాలకు బిగుస్తున్న ఉచ్చు.. భారత్‌కు రప్పిస్తారా? థెరిసా గ్రీన్ సిగ్నల్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోడీ కష్టాల్లో కూరుకుపోయారు. 2008 ఐపీఎల్ సీజన్ టీవీ ప్రసార హక్కులకు సంబంధించి వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్, మల్టీ స్క్రీన్ మ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోడీ కష్టాల్లో కూరుకుపోయారు. 2008 ఐపీఎల్ సీజన్ టీవీ ప్రసార హక్కులకు సంబంధించి వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్, మల్టీ స్క్రీన్ మీడియా(ఎమ్‌ఎస్‌ఎమ్)ల మధ్య జరిగిన లావాదేవీల్లో రూ. 425 కోట్ల మేరకు అవకతవకల్లో లలిత్ మోడీ ప్రమేయం ఉన్నట్లు బీసీసీఐ ఫిర్యాదు చేసింది. అనంతరం ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. గతేడాది ఆగస్టులో లలిత్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎల్‌ఆర్‌లు సైతం ఇప్పటికే మూడు జారీ అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో యూకేలో ఉన్న లలిత్ మోడీని భారత్‌కు రప్పించేందుకు ఈడీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. లలిత్ మోడీపై వారెంట్ జారీ చేయడంతో లెటర్స్ రెగోటరీ(ఎల్‌ఆర్) ద్వారా యూకే సాయం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎమ్‌ఎల్‌ఏ) న్యాయస్థానంలో గురువారం ఈడీ అప్పీలు చేయనుంది.
బ్రిటన్ ప్రధాని థెరిసా మే భారత పర్యటనలో ఉన్న నేపథ్యంలో వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న 60 మందిని స్వదేశానికి రప్పించడానికి సహకారం అందించాల్సిందిగా కేంద్రం విజ్ఞప్తి చేసింది. వీరిలో లలిత్ మోడీతో పాటు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కూడా ఉన్నారు. ఇందుకు థెరిసా కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.