ఏడేళ్ల బాలిక బ్యాటింగ్స్ స్కిల్స్ చూస్తే షాకవుతారు..
parisharma
ఈ వీడియోలో ఏడేళ్ల పరి శర్మ అనే అమ్మాయి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తోంది. మూవ్‌మెంట్స్ బెస్టుగా వున్నాయని మైకేల్ వాన్ కొనియాడాడు. వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షై హోప్ అదే వీడియో ట్వీట్ చూస్తూ 'నేను పెద్దయ్యాక పరి శర్మలా అవ్వాలనుకుంటున్నా' అని ఫన్నీగా ట్వీట్ చేశాడు. ఈ వీడియోలో పరి శర్మ బ్యాటింగ్‌పై ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు.
కామెంట్ సెక్షన్లో ర్యాస్ మోర్గాన్ అనే ట్విట్టర్ యూజర్.. ఇండియన్ ఆల్ రౌండర్ శిఖా పాండేను ట్యాగ్ చేశాడు. నువ్వు ఇలాంటి ప్లేయర్ ను కలవాలని అందులో రాసుకొచ్చాడు. దానికి రిప్లై ఇచ్చిన శిఖా పాండే అవును.. ఆమె నుంచి కొన్ని క్లాసులు నేర్చుకోవాల్సి ఉందని కామెంట్ పెట్టాడు.
Have a look at this video .. Pari Sharma .. 7 yrs old .. Her movements are as good as it gets
