1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 మే 2016 (13:13 IST)

సురేశ్ రైనా ముద్దుల కూతురు పేరు ''గ్రేసియా'': ఫోటోలు మీరూ చూడండి..!

ఐపీఎల్‌ 9వ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరమై ప్రెగ్నెంట్‌గా ఉన్న తన సతీమణి ప్రియాంక కోసం హాలెండ్ వెళ్ళిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా తండ్రి అయిన సంగతి తెలిసిందే. అతడి భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తన గారాల పట్టికి గ్రేసియా అనే పేరు పెట్టిన సురేశ్ రైనా.. తన ముద్దుల కూతురు ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 
 
పాపు పుట్టే క్రమంలో టెన్షన్ భారం అనిపించినా.. ప్రస్తుతం తన గారాలపట్టి ఫోటో షూట్‌కు రెడీ అయ్యిందని రైనా ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో తన కూతురు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.