గురువారం, 16 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 జులై 2018 (17:31 IST)

ద్రవిడ్‌కు అరుదైన గౌరవం.. ఐదో భారతీయుడిగా రికార్డు

భారత క్రికెట్‌లో "ది వాల్‌"గా పేరుగడించిన రాహుల్ ద్రవిడ్‌కు అరుదైనగౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో ద్రవిడ్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారులు తమ అధికారిక

భారత క్రికెట్‌లో "ది వాల్‌"గా పేరుగడించిన రాహుల్ ద్రవిడ్‌కు అరుదైనగౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో ద్రవిడ్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
ప్రస్తుతం భారత అండర్ 19 క్రికెట్ జట్టు కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న భారతీయ క్రికెటర్లలో ద్రవిడ్‌ కంటే ముందు బిష‌న్ సింగ్ బేడీ, సునీల్ గ‌వాస్క‌ర్‌, క‌పిల్ దేవ్‌, అనిల్ కుంబ్లేలు ఉన్నారు. 
 
ఇపుడు ద్రవిడ్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌, ఇంగ్లండ్ మ‌హిళా జ‌ట్టు మాజీ వికెట్ కీప‌ర్ క్ల‌యిర్ టైల‌ర్‌‌కు ఈ అరుదైన గౌర‌వాన్ని ఐసీసీ అధికారులు కల్పించారు. కాగా, మొత్తం 164 టెస్టులు, 344 వన్డేలు ఆడిన రాహుల్.. 'హాల్ ఆఫ్ ఫేమ్‌'‌లో చోటు ద‌క్క‌డంపై సంతోషాన్ని వ్య‌క్తంచేశాడు.