శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 మే 2021 (16:22 IST)

రాహుల్ ద్రవిడ్‌కు కొత్త బాధ్యతలు.. శ్రీలంక టూర్ కోచ్‌గా

భారత మాజీ కెప్టెన్‌, ద వాల్‌, ప్రస్తుత జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సిఎ) హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. జులైలో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల జట్టుకు టీమ్‌ ఇండియా కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. 
 
అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్‌మెంట్‌ ప్రకటించిన తర్వాత 2014లో ఇంగ్లాండ్‌లో పర్యటించిన భారత జట్టుకి బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం టెస్ట్‌ టీమ్‌తో రవిశాస్త్రి, భరత్‌ అరుణ్‌, విక్రమ్‌ రాథోడ్‌ ఇంగ్లాండ్‌ వెళ్లిన నేపథ్యంలో ....శ్రీలంక టూర్‌ కోచ్‌గా ద్రవిడ్‌ వ్యవహరిస్తారని అనధికారికంగా తెలుస్తోంది. 
 
కాగా, గతంలో యువకులను పదును పెట్టిన ద్రవిడ్‌... ఇప్పుడు ఈ యంగ్‌ టీమ్‌కు మార్గనిర్దేశకుడిగా వ్యవహరించడం జట్టుకు బలాన్ని ఇస్తుందని బిసిసిఐ అధికారి ఒకరు అన్నారు. అయితే బిసిసిఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.