సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (15:38 IST)

విండీస్ గడ్డపై విజృంభిస్తున్న కోహ్లీ సేన.. రహానే సెంచరీ.. బౌలర్లు రాణిస్తే గెలుపే!

కరేబియన్ గడ్డపై విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత జట్టు తన సత్తా చాటుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్‌పై పట్టు సాధించిన భారత జట్టు.. అదే స్థాయిలో బౌలర్లు రాణిస్తే గెలుపు

కరేబియన్ గడ్డపై విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత జట్టు తన సత్తా చాటుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్‌పై పట్టు సాధించిన భారత జట్టు.. అదే స్థాయిలో బౌలర్లు రాణిస్తే గెలుపును నమోదు చేసుకున్నట్టే. 358/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 500/9 వద్ద డిక్లేర్‌ చేసింది.
 
కానీ విండీస్ బ్యాటింగ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. విండీస్ బ్యాటింగ్‌కు సాధ్యపడలేదు. ఇక భారత ఇన్నింగ్స్‌లో రహానే 237 బంతుల్లో 13 ఫోర్లు,  మూడు సిక్సర్లలో అజేయ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో 108 పరుగులు సాధించాడు. వృద్ధిమాన్‌ సాహా(47)తో కలిసి ఆరో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత్‌ భారీ ఆధిక్యాన్ని సాధించగలిగింది. 
 
రెండో రోజు కేఎల్‌ రాహుల్‌(158) శతకం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్‌ బౌలర్లలో చేజ్‌ ఐదు వికెట్లు తీశాడు. ఇక రెండో రోజు 62 పరుగులు సాధించిన రహానే.. సోమవారం ఆటలో 108 పరుగులతో అదరగొట్టాడు. తద్వారా రహానే టెస్టుల్లో ఏడో సెంచరీని నమోదు చేసుకున్నాడు.