గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 జనవరి 2017 (17:28 IST)

అసిస్టెంట్ కోచ్‌గా అవతారం ఎత్తనున్న రికీ పాంటింగ్...

2012లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన పాంటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు అసిస్టెంట్ కోచ్‌గా రాబోతున్నాడు. ఫిబ్రవరిలో శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సి

2012లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన పాంటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు అసిస్టెంట్ కోచ్‌గా రాబోతున్నాడు. ఫిబ్రవరిలో శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు పాంటింగ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జస్టిన్ లాంగర్‌ను హెడ్ కోచ్‌గా, గిలెప్పీని అసిస్టెంట్ కోచ్‌గా నియమించగా.. వీరితో పాంటింగ్ జత కలవనున్నాడు. 
 
వీరి ముగ్గురిదీ తాత్కాలిక నియామకమేనని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. కాగా ఆస్ట్రేలియా క్రికెట్‌కు స్వర్ణయుగంగా పేరొందిన రోజుల్లో అతను ఆ జట్టు సారథి. వన్డేల్లో 2002 నుంచి, టెస్టుల్లో 2004 నుంచి 2011 వరకు ఆ జట్టు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. అప్పట్లో ఆసిస్ సేనను విజయపథంలో రికీ పాంటింగ్ నడిపించాడు.