రాబిన్ ఊతప్ప తండ్రి అయ్యాడు..  
                                          టీమిడియా క్రికెటర్ రాబిన్ ఊతప్ప (31) తండ్రి అయ్యాడు. ఆయన భార్య శీతల్ గౌతమ్ మంగళవారం ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు కుమారుడితో తీసుకున్న ఫొటోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు. సంతోషాలు తమ దరిచేర
                                       
                  
                  				  టీమిడియా క్రికెటర్ రాబిన్ ఊతప్ప (31) తండ్రి అయ్యాడు. ఆయన భార్య శీతల్ గౌతమ్ మంగళవారం ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు కుమారుడితో తీసుకున్న ఫొటోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు. సంతోషాలు తమ దరిచేరాయని శీతల్ గౌతమ్ పేర్కొన్నాడు.
				  											
																													
									  తనను అభినందించే అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తండ్రైన ఉతప్పకు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.
				  
	 
	రవిచంద్రన్ అశ్విన్, సురేశ్ రైనా సహా పలువురు టీమిండియా ఆటగాళ్లు ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. కర్ణాటకకు చెందిన రాబిన్ ఊతప్ప 2006లో ఇంగ్లండ్  టూర్‌లో భారత్‌కు తొలిసారి ఆడాడు. ఇప్పటివరకు 46వన్డేలు ఆడాడు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  13 ట్వంటీ-20 మ్యాచ్‌లు, 149 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 25.94 సగటుతో 934 పరుగులు చేశాడు. చివరి సారిగా హరారేలో జింబాబ్వేతో జరిగిన వన్డేలో ఆడాడు.