ట్విట్టర్ నిబంధనలను అతిక్రమించిన సచిన్.. ఫోన్ నెంబర్లు అడిగితే ఎలా?
సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్ నిబంధనలను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అతిక్రమించినట్లు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. క్రికెట్ దేవుడిగా ప్రశంసలందుకుంటున్న సచిన్.. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయా
సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్ నిబంధనలను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అతిక్రమించినట్లు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. క్రికెట్ దేవుడిగా ప్రశంసలందుకుంటున్న సచిన్.. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. ప్రస్తుతం సచిన్‌కు 1.7 కోట్ల మంది ఫాలోయర్స్ వున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సచిన్ టెండూల్కర్ నటించిన ఆరోగ్యానికి సంబంధించిన ప్రకటనను తన ట్విట్టర్ పేజీలో సచిన్ పోస్ట్ చేశాడు.
అందులో "మీ స్నేహితులు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? సాకులు చెప్తున్నారా? అయితే #NoExcuse అనే హ్యాష్ ట్యాగ్‌లో.. వారు నివసించే నగరం పేరు, మొబైల్ నెంబర్‌ను ట్యాగ్ చేయండి. నేను వారితో మాట్లాడుతాను.." అని సచిన్ అన్నాడు.
సచిన్ విజ్ఞప్తి మేరకు ఆయన ఫ్యాన్స్ కొందరు మొబైల్ నెంబర్లను ట్యాగ్ చేశారు. అయితే సచిన్ చేసిన ట్వీట్ వ్యక్తిగత హక్కును హరించేలా వుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇంకా సచిన్ చేసిన ట్వీట్ ద్వారా ట్విట్టర్ నిబంధనలను అధిగమించినట్లైందని కామెంట్స్ చేశారు.