1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Sachin Tendulkar Makes Ukadiche Modak For First Time

ఆవిరి కుడుములు తయారు చేసి అమ్మకు తినిపించిన మాస్టర్ బ్లాస్టర్ (వీడియో)

sachin Ukadiche Modak
క్రికెట్ మైదానంలో తన బ్యాటుతో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇపుడు వంట గదిలో కూడా ఎంతో ప్రావీణ్యమున్న కుక్‌గా మారిపోయాడు. కిచెన్‌లో తన వంట నైపుణ్యంతో అదరగొడుతూ, మహారాష్ట్ర సంప్రదాయ వంటకమైన ఉక్దిచే మోదక్ (ఆవిరి కుడుము)ను తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా, అది క్షణాల్లో వైరల్‌గా మారింది. 
 
వీడియోలో సచిన్ ఎంతో శ్రద్ధగా, సంప్రదాయ పద్ధతిలో వంటకాన్ని తయారు చేయడం కనిపించింది. ఆవిరి మీద ఉడికించే ఈ పదార్థాన్ని ఆయన సచిన్ చాలా నిపుణుడిలా తయారు చేయడం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. పైగా, తాను తయారు చేసిన వంటకాన్ని ఆప్యాయంగా తన తల్లికి రుచి చూపించాడు. ఆ తర్వాత తాను కూడా ఆరగించాడు. 
 
క్రికెట్ మైదానంలో ఎంతో ఏగాగ్రతతో ఆడతాడో వంట గదిలోనూ అంతే శ్రద్ధ చూపిస్తూ ఆ వంటాన్ని సచిన్ తయారు చేయడం గమనార్హం. ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బ్యాటింగ్‌లోనే కాదు... వంట గదిలో కూడా మాస్టర్ బ్లాస్టరే అంటూ కొనియాడుతున్నారు. క్రికెట్ దేవుడు కిచెన్‌లో కూడా దేవుడే అని మరికొందరు సరదాగా కామెంట్స్ చేయడం గమనార్హం. 


 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వినేశ్ ఫోగట్ దేశానికి గర్వకారణం : సుప్రీంకోర్టు