సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (12:37 IST)

భారత ఆటగాళ్ళలో పోరాటపటిమ ఉంది.. కోహ్లీ సేనకు సచిన్ అండ

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చేతిలో స్వదేశంలో చిత్తుగా ఓడిన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లపై నలువైపులా విమర్శలు వస్తున్నాయి. కానీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం టీమిండియాకు అండగా నిలిచింది. ఆదివా

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చేతిలో స్వదేశంలో చిత్తుగా ఓడిన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లపై నలువైపులా విమర్శలు వస్తున్నాయి. కానీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం టీమిండియాకు అండగా నిలిచింది. ఆదివారం ఉదయం ఢిల్లీలో జరిగిన 21 కిలోమీటర్ల మారథాన్‌ పోటీ జరిగింది. ఇందులో సచిన్ టెండూల్కర్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత జట్టు సిరీస్‌ను కోల్పోలేదని, మన ఆటగాళ్లలో పోరాటపటిమ ఉందని అన్నారు. ఒక్క ఓటమిని చవి చూసినంత మాత్రాన పోరాడలేక చేతులు ఎత్తేసినట్టు భావించరాదని, తదుపరి జరిగే మ్యాచ్‌లలో భారత ఆటగాళ్లు పుంజుకుని, మంచి ప్రదర్శన ఇస్తారన్న నమ్మకం ఉందని సచిన్ చెప్పారు.
 
కాగా, పూణే వేదికగా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరిగిన తొలిటెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఊహించ‌ని రీతిలో ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న విషయం తెల్సిందే. ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ముందు 440 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా, టీమిండియా ఆది నుంచే త‌డ‌బ‌డుతూ వ‌చ్చి రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 107 ప‌రుగుల‌కే ఆలౌట‌యింది. దీంతో ఆస్ట్రేలియా 333 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం న‌మోదు చేసుకుంది. దీంతో భారత జట్టు తీవ్ర నైరాశ్యంలో కూరుకునిపోయింది.