గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (17:26 IST)

నా భర్త చికెన్‌లా ఉంటాడంటున్న హైదరాబాద్ టెన్నిస్ ఏస్

హైదరాబాద్ టెన్నిస్ ఏస్ సానియా మీర్జా తన భర్త గురించి చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్‌గా మారాయి. ఆ కామెంట్స్‌కు అనేక మంది లైక్ చేస్తూ షేర్లు చేస్తుండటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ సానియా తన భర

హైదరాబాద్ టెన్నిస్ ఏస్ సానియా మీర్జా తన భర్త గురించి చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్‌గా మారాయి. ఆ కామెంట్స్‌కు అనేక మంది లైక్ చేస్తూ షేర్లు చేస్తుండటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ సానియా తన భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ చికెన్‌లా ఉంటాడని వ్యాఖ్యానించింది. 
 
దీనిపై డేనియెల్ అలెగ్జాండర్ అనే నెటిజన్.. షోయబ్ మాలిక్, షహీన్ షా అఫ్రిది అఫ్రిది ఇద్దరూ పాక్ జట్టుకు ఆడుతున్నారు. అఫ్రిది ఏప్రిల్ 6, 2000 సంవత్సరంలో పుట్టాడు. మాలిక్ అక్టోబర్ 14, 1999లో క్రికెటర్ అరంగ్రేటం చేశాడని డానియెల్ ట్వీట్ చేశాడు. కాగా మాలిక్ ఫిబ్రవరి 1, 1982లో జన్మించిన విషయం తెలిసిందే.
 
అయితే నెటిజన్ డేనియెల్ ట్వీట్‌పై టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా స్పందించారు. 'కామన్.. నా భర్త ఇప్పటికీ స్ప్రింగ్ చికెన్‌లా ఉంటాడంటూ ' డానియెల్ ట్వీట్‌కు సానియా బదులిచ్చారు. సానియా ట్వీట్‌కు అనూహ్య స్పందన వస్తోంది.