గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (15:59 IST)

కరోనా వైరస్ సోకి ఢిల్లీ మాజీ క్రికెటర్ కన్నుమూత... ఎక్కడ?

కరోనా వైరస్ సోకి భారత క్రికెటర్ ఒకరు కన్నమూశారు. ఈయన ఢిల్లీ అండర్ 23 జట్టుకు సహాయక సిబ్బందిగా కూడా సేవలు అందించాడు. ఆ క్రికెటర్ పేరు సంజయ్ డోబల్. ఈయనకు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చాడు. అయితే, ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన తాజాగా కన్నుమూశారు. 
 
53 యేళ్ళ వయసున్న డోబల్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సిద్ధాంత్.. రాజస్థాన్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతుండగా.. చిన్న కుమారుడు ఏకాన్ష్‌ ఢిల్లీ అండర్ -23 జట్టులో అరంగేట్రం చేశాడు.
 
'కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడటంతో సంజయ్‌ డోబల్‌ వారం రోజుల క్రితం మహదూర్‌గఢ్‌లోని దవాఖానలో చేరాడు. కొవిడ్ -19కు పాజిటివ్‌గా నిర్దారణ అయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. 
 
మరింత మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం ఆయనను ద్వారకా దవాఖానకు మార్చి ప్లాస్మా చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోగా సోమవారం ఉదయం కన్నుమూశారు' అని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
ఢిల్లీ క్రికెటర్లలో వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, మిథున్ మన్హాస్‌తో కలిసి ఆడారు. అతను సొనెట్ క్రికెట్ క్లబ్ తరపున ఆడి కోచ్‌ తారక్ సిన్హా శిక్షణలో రాటుదేలారు. రంజీలో ఆడనప్పటికీ డోబల్ ఎయిర్ ఇండియాతో కాంట్రాక్ట్‌ ముగిసిన తర్వాత జూనియర్ క్రికెటర్లకు శిక్షకుడిగా సేవలందించారు.