1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Shakib Al Hasan Faces ICC Ban For Not Reporting Corrupt Approach

బంగ్లాదేశ్ ట్వంటీ20 జట్టు కెప్టెన్‌పై వేటు.. భారత్ పర్యటనకు అనుమానమే!

Shakib Al Hasan
బంగ్లాదేశ్ ట్వంటీ20తో పాటు టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ షకిబ్ అల్ హాసన్‌ క్రికెట్ కెరీర్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రెండేళ్ళ క్రితం బుకీ ఒకరు షకీబుల్ హాసన్‌ను కలిసాడు. ఇది ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జరిగింది. కానీ, ఈ విషయాన్ని షకీబుల్ ఐసీసీ దృష్టికి తీసుకెళ్లలేదు. ఈ విషయంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా, ఈ వ్యవహారంపై విచారణ జరుగుతున్నందుకు షకీబుల్‌ను క్రికెట్‌కు దూరంగా ఉంచాలని ఐసీసీ ఆదేశించింది. దీంతో షకిబ్ ప్రాక్టీస్ కు కూడా దూరమయ్యాడు. ఫలితంగా భారత్ పర్యటనకు షకీబుల్ దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రెండేళ్ల క్రితం ఓ అంతర్జాతీయ మ్యాచ్ ప్రారంభానికి ముందు బుకీ ఒకరు షకిబ్‌ కలిసినట్టు ఓ వార్తా పత్రికలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి వెల్లడించలేదని పేర్కొంది. దీనిపై ఐసీసీ ఇపుడు దృష్టిసారించింది. తమ విచారణలో షకిబ్ ఈ విషయాన్ని ఒప్పుకున్నాడని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో అతన్ని క్రికెట్ కు దూరంగా ఉంచాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఐసీసీ ఆదేశించింది. పైగా, అతనిపై ఆరోపణలు రుజువైతే 19 నెలల పాటు నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇటీవల బంగ్లా క్రికెటర్లు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. బీసీబీ ఈ గండం నుంచి బయటపడ్డప్పటికీ షకిబ్ వ్యవహారం బోర్డుకు మింగుడుపడటంలేదు. వచ్చే నెల 3 నుంచి భారత్‌లో బంగ్లాదేశ్ జట్టు పర్యటన షురూ కానున్న నేపథ్యంలో ఆ జట్టుకు మీర్పూర్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఏర్పాటు చేశారు. షకిబ్ దీనికి హాజరు కాలేదు. దీంతో షకిబ్ భారత పర్యటనలో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
విరాట్ కోహ్లీ తలకు వెల కట్టిన లష్కరే తోయిబా