ఆదివారం, 26 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (21:03 IST)

శ్రేయాస్‌ అయ్యర్‌కు శస్త్రచికిత్స.. కోలుకోడానికి 5-6 నెలలు పట్టవచ్చు..!

భారత బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్‌ అయ్యర్ ఎడమ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో ఆయనకు గాయం తగిలింది. ఏప్రిల్‌ 8న అయ్యర్‌కు భుజానికి శస్త్ర చికిత్స చేయనున్నారు. సర్జరీ తర్వాత అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఐదు నెలల పట్టే అవకాశం ఉంది. 
 
గాయం కారణంగా అయ్యర్ ఐపీఎల్‌ 2021 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే ఆగస్టులో ఇంగ్లాండ్‌ పర్యటనకు దూరంకానున్నాడు. అతడు కోలుకోవడానికి 4-5 నెలలు పడుతుందని తెలిసింది. 
 
సొంతగడ్డపై సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లకు అతడు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా ఉన్న అయ్యర్‌ స్థానంలో యాజమాన్యం కొత్త సారథిని ప్రకటించాల్సి ఉంది.