గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (17:13 IST)

Shubman Gill: వన్డే క్రికెట్ చరిత్రలో మైలురాయి.. 2500 పరుగులతో గిల్ రికార్డ్

Shubman Gill
Shubman Gill
ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కీలక మైలురాయిని సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు చేసిన తొలి ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా గిల్ నిలిచాడు. కేవలం 50 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు.
 
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం ఒక పరుగుకే ఔటవడంతో ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. అయితే, విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్‌ల బలమైన భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. ఇటీవల ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న కోహ్లీ అర్ధ సెంచరీ (52) సాధించగా, గిల్ ఈ సిరీస్‌లో వరుసగా మూడో అర్ధ సెంచరీ సాధించాడు.
 
ఈ జంట రెండో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించి, భారత ఇన్నింగ్స్‌ను స్థిరపరిచింది. 23 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 147/2తో నిలిచింది.