బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (09:11 IST)

చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు భారీ షాక్!

Bumrah
పాకిస్థాన్ వేదికగా ఐసీసీ నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీకి ముందు భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకోలేక పోవడంతో ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను జట్టులోకి ఎంపిక చేయలేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఇపుడు ఆడిస్తే మళ్లీ గాయం తిరగబెట్టే అవకాశం ఉందని వైద్యుల సలహా మేరకు బుమ్రాను జట్టు నుంచి తప్పించినట్టు బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అదేసమయంలో బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాకు చోటు కల్పించారు. కాగా, ఈ నెల 19వ తేదీ నుంచి పాకిస్థాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానున్న విషయం తెల్సిందే. అయితే, భారత్ ఆడే మ్యాచ్‌లను మాత్రం హైబ్రిడ్ విధానంలో దుబాయ్, యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. 
 
బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీలో వైద్య బృందం ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నా బుమ్రా కోలుకోలేకపోయాడు. ఫిట్నెస్ సాధించడంలో విఫలం కావడంతో జట్టు నుంచి అతడిని తప్పించారు. చాంపియ్స్ ట్రోఫీ జట్టులో మార్పు చేర్పులకు మంగళవారం తుది గడువు ముగియడంతో బుమ్రా ఫిట్నెస్‌పై ఎన్.సి.ఏ వైద్య బృందం బీసీసీఐకు తుది నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పరిశీలించిన బీసీసీఐ సెలెక్టర్లు బుమ్రాను తప్పించి, హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. అయితే, వచ్చే నెల 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ టోర్నీ నాటికి బుమ్రా ఫిట్నెస్ సాధించే అవకాలు ఉన్నాయి.