మంగళవారం, 15 జులై 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 15 మే 2016 (11:21 IST)

కేరళ... మరో సోమాలియానా? నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై క్రికెటర్ శ్రీశాంత్ ఏమన్నారు?

శిశుమరణాల విషయంలో సోమాలియా దేశంతో కేరళ రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోల్చారు. దీనిపై కేరళ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా.. ఆ రాష్ట్రంలోని బీజేపీయేతర రాజకీయ పార్టీలన్నీ ప్రధాని మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టాయి. 
 
ఈ నేపథ్యంలో రాజకీయ నేతగా మారిన అదే రాష్ట్రానికి చెందిన క్రికెటర్ శ్రీశాంత్ మాత్రం మోడీకి అండగా నిలిచారు. మోడీ లేవనెత్తిన అంశం చాలా సున్నితమైందని దాన్ని అర్థం చేసుకోకుండా కేరళను సోమాలియాతో పోల్చారని అంతా విమర్శించడం సరికాదన్నారు. ఈ విషయంలో తాను నరేంద్ర మోదీకి మద్దతుగా నిలుస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఆయన మొత్తం కేరళను సోమాలియాతో పోల్చలేదన్నారు. కేరళలోని దళితులు నివసిస్తున్న ప్రాంతాల్లో శిశుమరణాల రేటు అధికంగా ఉందన్నారు. అది సోమాలియాలోలాగ ఇక్కడ కూడా చాలా పెద్ద సమస్య అని మోడీ అన్నారన్నారు. దీన్ని అర్థం చేసుకోకుండా.. సోషల్‌మీడియాలో, కేరళలో మోడీ వ్యాఖ్యలను పలువురు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.