మంగళవారం, 11 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: ఆదివారం, 29 మే 2016 (23:44 IST)

కట్టింగ్ దెబ్బకు RCB విలవిల... గేల్-కోహ్లి తర్వాత క్యూ... ఐపీఎల్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అటు బ్యాటింగుతో ఇటు బౌలింగుతో నడ్డి విరిచాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు కట్టింగ్. కీలకమైన గేల్ వికెట్ తీయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీని అందుకుంది. తొలుత బ్యాటింగులో ఆర

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అటు బ్యాటింగుతో ఇటు బౌలింగుతో నడ్డి విరిచాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు కట్టింగ్. కీలకమైన గేల్ వికెట్ తీయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీని అందుకుంది. తొలుత బ్యాటింగులో ఆర్సీబికి చుక్కలు చూపించాడు కట్టింగ్.


కేవలం 15 బంతుల్లో 39 పరుగులు చేసి కేక పెట్టించాడు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబిని కోలుకోలేని దెబ్బ తీయడంలో కట్టింగ్ కీలక పాత్ర పోషించాడు. దీనితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు క్యూ కట్టేశారు. గేల్-కోహ్లి 100 పరుగులు దాటేవరకూ వికెట్ నష్టపోకుండా లాగించేశారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ చతికిలపడింది. 
 
గేల్ 38 బంతుల్లో 76, కోహ్లి 35 బంతుల్లో 54 తర్వాత మిగిలినవారు డీవిలియర్స్ 5, రాహుల్ 11, వాట్సన్ 11, బిన్ని 9, జోర్డన్ 3 పరుగులు చేసి వరుసగా వికెట్లు ఇచ్చి క్యూ కట్టారు. సచిన్ బేబి 18(నాటౌట్), అబ్దుల్లా 4(నాటౌట్)లు చివర్లో ఎంత శ్రమించినా 20 ఓవర్లలో 200 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీనితో మరో 9 పరుగులు అందుకోలేక విజయాన్ని చేజార్చుకున్నారు. 
 
అంతకుముందు సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా ఆడింది. 20 ఓవర్లకు 208 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టులో వార్నర్ 38 బంతుల్లో 69 పరుగులు, ధావన్ 25 పరుగులు, హెన్రిక్స్ 4, యువరాజ్ సింగ్ 38, హూడా 3, కట్టింగ్ 15 బంతుల్లో 39 పరుగులు, ఊజా 7, శర్మ 5, కుమార్ 1, ఎక్స్‌ట్రాలు 14 సహాయంతో 208 పరుగులు చేశారు. విశేషం ఏమిటంటే చివరి 3 ఓవర్లలో సన్ రైజర్స్ 52 పరుగులు చేయడం. మొత్తమ్మీద సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగులు వేట కాసేపు ఆగి, కాసేపు దూకుడుతో సాగింది.