జవాన్లు.. మీ ఆట అదిరింది.. వీరేంద్ర సెహ్వాగ్
పుల్వామా ఉగ్రదాడికి భారత ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‍లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత్‌కు చెందిన మిరాజ్ యుద్ధ విమానాలు మెరుపుదాడులు చేశాయి. ఈ దాడుల్లో దాదాపుగా 300 మంది ఉగ్రవాదులు వరకు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. సర్జికల్ స్టైక్-2 పేరుతో నిర్వహించిన ఈ దాడులపై దేశం యావత్తూ హర్షం వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ, 'జవాన్లు.. మీ ఆట అదిరింది' అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు ఎయిర్‌స్ట్రైక్ హ్యాష్ ట్యాగ్‌ను జోడించాడు. మరొక మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందిస్తూ..'భారత్ ఆర్మీకి ఇదే నా సెల్యూట్' అని ట్వీట్ చేశాడు. ఇక గౌతం గంభీర్ 'జై హింద్ ఐఎఎఫ్' అంటూ ట్వీట్ చేశాడు.
టీమిండియా యువ క్రికెటర్ యజ్వేంద్ర చహల్ భారత ఆర్మీని ప్రశంసించాడు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దేశం మొత్తాన్ని కలచివేసిన ఆ ఘటనకు ప‍్రతీకారంగానే ఉగ్రస్థావరాలపై భారత్ మరో మెరుపు దాడి చేసింది. ఈ ఘటనలో 200 నుంచి 300 వరకూ ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.