ఐసీసీ ట్వంటీ-20 ర్యాంకింగ్స్.. కేఎల్ రాహుల్ ఒక్కడే?

Last Updated: శుక్రవారం, 1 మార్చి 2019 (10:27 IST)
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో కేఎల్ రాహుల్ మాత్రమే స్థానం సంపాదించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రాహుల్ మాత్రమే తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఆసీస్‌పై రెండు టీ20ల్లో కలిపి 97 పరుగులు చేసిన రాహుల్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి కైవసం చేసుకున్నాడు. 
 
ఇక భారత్‌ గడ్డపై జరిగిన టీ-20ల్లో 56, 113 పరుగులు రాబట్టిన ఆసీస్ స్టార్ మ్యాక్స్‌వెల్ టీ-20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ర్యాంకింగ్స్‌లో రోహిత్ 12వ స్థానంలో ఉండగా.. ధావన్ 15వ స్థానంలో, కోహ్లి 17వ స్థానంలో ఉన్నారు. 
 
కోహ్లి ఏడు స్థానాలు ఎగబాకి 56వ స్థానానికి చేరుకున్నాడు. జట్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే పాక్ అగ్రస్థానంలో, భారత్ రెండో స్థానంలో నిలిచాయి. టీమిండియాపై సిరీస్ గెలిచిన ఆసీస్ మూడోస్థానానికి ఎగబాకింది.దీనిపై మరింత చదవండి :