బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 5 నవంబరు 2021 (23:04 IST)

స్కాట్లాండ్ పైన భారత్ భారీ విజయం, సెమీస్ ఆశలున్నట్లేనా?

టి20 ప్రపంచ కప్, భారతదేశం vs స్కాట్లాండ్ మ్యాచ్ అనుకున్నట్లే జరిగింది. శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తమ సెమీ-ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి జరుగుతున్న ICC T20 ప్రపంచ కప్‌లో సూపర్ 12 గ్రూప్ 2 మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించింది.
 
లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా, పేసర్ మహమ్మద్ షమీ తలో మూడు వికెట్లు తీయడంతో స్కాట్లండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది. స్కాట్లాండ్ తరఫున ఓపెనర్ జార్జ్ మున్సే 24 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు.
 
ఇక టీమిండియా విషయానికి వస్తే.. 86 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కేఎల్ రాహుల్ (50), రోహిత్ శర్మ (30) ఐదు ఓవర్లలో 70 పరుగులు జోడించి స్కాట్లాండ్‌ను ఆశలను పూర్తిగా వమ్ము చేసారు. కేవలం 6.3 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేధించింది.
 
స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 ఆలౌట్. (జార్జ్ మున్సే 24, క్రిస్ గ్రీవ్స్ 21; ఆర్ జడేజా 3/15, ఎం షమీ 3/15). భారత్ 6.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. (కేఎల్ రాహుల్ 50, ఆర్ శర్మ 30; బి వీల్ 1/32).