ధోనీ షాకింగ్ నిర్ణయం... 200వ వన్డేకు మిస్, కెప్టెన్సీకి గుడ్ బై, కోహ్లికి పగ్గాలు...

జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. టీమిండియా వన్డే కెప్టెన్సీకి గుడ్‌పై చెప్పేశాడు. ఈ నిర్ణయాన్ని బీసీసీఐకు తెలపడంతో బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో విషయాన్ని పోస్ట్ చేసింది. దీనితో క్రికెట్ క్రీడాభిమానులు షాక్ తిన్నారు. కొ

dhoni
ivr| Last Modified బుధవారం, 4 జనవరి 2017 (22:12 IST)
జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. టీమిండియా వన్డే కెప్టెన్సీకి గుడ్‌పై చెప్పేశాడు. ఈ నిర్ణయాన్ని బీసీసీఐకు తెలపడంతో బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో విషయాన్ని పోస్ట్ చేసింది. దీనితో క్రికెట్ క్రీడాభిమానులు షాక్ తిన్నారు. కొత్త సంవత్సరంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. కాగా ధోనీ 199 వన్డేలకు సారధ్య బాధ్యతలను వహించాడు. మరో 72 టి-ట్వంటీ మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఐతే తను కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకుంటున్నాను కానీ జట్టు నుంచి కాదని స్పష్టం చేశాడు. ధోనీ నిర్ణయంతో విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది.దీనిపై మరింత చదవండి :