శనివారం, 16 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: ఆదివారం, 29 జనవరి 2017 (23:11 IST)

ఉఫ్... నరాల తెగే ఉత్కంఠ... హమ్మయ్య కోహ్లి సేన గెలిచింది... 5 పరుగుల తేడాతో....

భారత్ - ఇంగ్లాండు జట్ల మధ్య నాగపూర్లో జరిగిన రెండో టీ20లో భారత్ నరాల తెగే ఉత్కంఠ మధ్య ఇంగ్లాండును 5 పరుగుల తేడాతో ఓడించింది. ఇంగ్లాండు ముందు 145 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచిన టీమ్ ఇండియాకు ఇంగ్లాండు బ్యాట్సమన్లు రూట్(38), స్టోక్స్(38) చుక్కలు చూపించా

భారత్ - ఇంగ్లాండు జట్ల మధ్య నాగపూర్లో జరిగిన రెండో టీ20లో భారత్ నరాల తెగే ఉత్కంఠ మధ్య ఇంగ్లాండును 5 పరుగుల తేడాతో ఓడించింది. ఇంగ్లాండు ముందు 145 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచిన టీమ్ ఇండియాకు ఇంగ్లాండు బ్యాట్సమన్లు రూట్(38), స్టోక్స్(38) చుక్కలు చూపించారు. ఐతే బుమ్రా, నెహ్రాల దెబ్బకు ఇద్దరూ అవుట్ కావడంతో ఇండియా ఊపిరి పీల్చుకుంది. ఇంతలో బట్లర్ ప్రమాదకరమైన బ్యాట్సమన్ గా మారాడు. చివరి 19 ఓవర్లో ఒక ఫోర్, ఒక సిక్స్ లిఫ్ట్ చేసి విజయం ఇంగ్లాండు వశమవుతుందన్న అనుమానాలు రేకెత్తించాడు. దీనితో ఇండియన్ ఆటగాళ్లకు గుండెల్లో రైళ్లు పరుగెడినంత పనైంది. 
 
గ్యాలరీలో టీమిండియా అభిమానులు ఊపిరి బిగపట్టి ఆటన చూస్తున్నారు. 6 బంతుల్లో 8 పరుగులు చాలు. లక్ష్యం ఛేదించదగ్గదే. ఇంకేముంది... అందరూ ఉత్కంఠతతో చూస్తున్న తరుణంలో బుమ్రా మొదటి బంతి వేసాడు. ప్రమాదకర బ్యాట్సమన్ రూట్ అవుటయ్యాడు. రెండవ బంతి బట్లర్ కి, పరుగేమీ రాలేదు. మూడవ బంతి మరో ప్రమాదకర బ్యాట్సమన్ బట్లర్ వికెట్టును గిరాటేసింది. ఇక అంతే... భారత్ విజయం దాదాపు ఖాయమైంది. ఐతే చివరి బంతి వరకూ ఉత్కంఠ సాగింది.