ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 జూన్ 2017 (10:13 IST)

పాకిస్థాన్ గెలుస్తుందని.. ఒంటెతో జోస్యం చెప్పిన పాక్ జర్నలిస్ట్.. అయితే సీన్ రివర్సైంది..

ఒంటె జోస్యం ఫలించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ జట్లు ఆదివారం నువ్వానేనా అంటూ తలపడ్డాయి. ఈ పోరులో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించాలని కాశ్మీర్‌లో సైనికులు డ్యాన్

ఒంటె జోస్యం ఫలించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ జట్లు ఆదివారం నువ్వానేనా అంటూ తలపడ్డాయి. ఈ పోరులో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించాలని కాశ్మీర్‌లో సైనికులు డ్యాన్సులు చేస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో.. తాజాగా భారత్-పాకిస్థాన్‌లో పాక్ గెలుస్తుందని ఒంటె జోస్యం చెప్పింది.
 
ఆ ఒంటెతో పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు జోస్యం చెప్పించారు. ఇస్లామాబాద్‌లోని ఓ రోడ్డుపై ఏర్పాటు చేసిన టేబుల్‌పై ‘ఇండియా’, ‘పాకిస్థాన్’ అని రాసి ఉన్న రెండు కార్డు బోర్డులను ఉంచారు. ఆ టేబుల్ దగ్గరకు ఒంటెను దాని యజమాని తీసుకువచ్చారు. ఆ టేబుల్ దగ్గరకు వచ్చిన ఒంటె ‘పాకిస్థాన్’ పేరు రాసి ఉన్న కార్డు బోర్డును పట్టుకుంది. దీంతో, ఈ మ్యాచ్ లో పాక్ గెలుపు ఖాయమంటూ సదరు జర్నలిస్టు సహా అక్కడ ఉన్నవారు గెంతులేశారు. కానీ ఈ ఒంటె జోస్యం ఏమాత్రం ఫలించలేదు.