సచిన్‌కు కరోనా.. లక్షణాలు ఎక్కువగా వుండటంతో.. ఆస్పత్రిలో చేరిక
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచే సెలెబ్రిటీల వరకు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతుంది. ఇప్పటికే ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రీటీలకు కరోనా సోకింది. అటు క్రికెటర్లపై కరోనా పంజా విసురుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే సచిన్, పఠాన్ బ్రదర్స్, బద్రీనాథ్‌లకు కరోనా సోకింది. అయితే.. ఇటీవలే కరోనా బారిన పడ్డ సచిన్ టెండూల్కర్.. ఇవాళ ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల సలహా మేరకు తాను ఆస్పత్రిలో చేరుతున్నట్లు సచిన్ ప్రకటించారు. త్వరలోనే తాను క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని సచిన్ ట్వీట్ చేశాడు.
కరోనా పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సచిన్ కోరారు. తన క్షేమం కోరుకునే వారికి ధన్యవాదాలు తెలిపారు సచిన్. కాగా.. మార్చి 27న సచిన్ కరోనా బారీన పడ్డారు. అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు.