శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (12:47 IST)

డెహ్రాడూన్‌లో వాలిన ప్రేమపక్షులు.. అనుష్క భుజంపై చేయి వేసిన కోహ్లీ.. ఫోటో వైరల్

ప్రేమ పక్షులైన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తమ లవ్ స్టోరీకి పుల్ స్టాప్ పెట్టి ఓ ఇంటివారు కానున్నారని, జనవరి ఒకటో తేదీన ఇద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారని వార్తలు

ప్రేమ పక్షులైన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తమ లవ్ స్టోరీకి పుల్ స్టాప్ పెట్టి ఓ ఇంటివారు కానున్నారని, జనవరి ఒకటో తేదీన ఇద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కోహ్లీ ఖండించాడు. కోహ్లీ ట్వీట్ చేసిన ట్వీట్లను అనుష్క శర్మ రీట్వీట్ చేసింది. తాము జనవరి 1న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు రూమర్లేనంటూ పేర్కొంది.
 
తాము పెళ్లి చేసుకుంటే దాచుకోమని క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, అతడి ప్రియురాలు అనుష్కశర్మ కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. డెహ్రాడూన్‌ విమానాశ్రయంలో తీసిన ఈ ఫొటోలో కోహ్లి.. అనుష్క శర్మతో సన్నిహితంగా భుజంపై చేయి వేశాడు. వీరిద్దరు క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల నిమిత్తం ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ వస్తూ డెహ్రాడూన్‌ విమానాశ్రయంలో ఇలా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.